Medigadda Barrage Damage: మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర బృందం అన్ని వివరాలు తెలుసుకున్నారని, ఇంకా అదనపు సమాచారం అడిగారని ఆయన వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గాక పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు. నీటిని మళ్లించి వేసవి వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాపర్ డ్యామ్‌లో వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబర్ నెలాఖరులోగా సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.
Also Read: Harish Rao: బీజేపీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపింది..
మేడిగడ్డ డ్యాం పిల్లర్ కూలిన ఘటనలో ఎలాంటి కుట్ర లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ అన్నారు. పునాది కింద ఇసుక తరలింపు వల్ల సమస్య తలెత్తి ఉండవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం లేదు. ఇప్పటికే డ్యామ్‌కు నీటి ప్రవాహం తగ్గింది. ఆ వైపు ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించేందుకు చంద్రవంక ఆకారంలో కాపర్ డ్యామ్ నిర్మించాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డ్యామ్‌ను ఎనిమిది బ్లాకులుగా నిర్మిస్తుండడంతో కేవలం ఏడో బ్లాక్‌కు మాత్రమే గండి పడుతుందని, మిగిలిన బ్లాకులకు ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కొంత తగ్గుతుందని, అయితే పంపులు ఎత్తివేసేందుకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
Also Read: Congress: బీజేపీ-బీఆర్‌ఎస్‌ల లగ్గం పిలుపు.. పెండ్లి కార్డు విడుదల చేసిన కాంగ్రెస్
ఇదిలా ఉండగా.. మేడిగడ్డ ఆనకట్ట సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమైంది. సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వాటర్‌వర్క్స్‌లో ఇంజనీర్లతో సమావేశమైంది. సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధరన్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యదర్శి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇంజినీర్లు, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.