Marri Shashidhar Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని భావించి కొందరు అటు వైపు వెళ్తున్నారని.. కానీ, భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నేను కూడా పార్టీ మారుతున్నానని ప్రచారం జరుగుతోందని తెలిపిన ఆయన.. తాను గాలికి వచ్చి వెళ్లేవాడిని కానన్నారు. బీజేపీలోనే కొనసాగుతానని మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కీలక భేటీ.. తెలంగాణలో జనసేన సీట్లపై క్లారిటీ!
బీజేపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీలో చేరారని, కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు.