మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు.
పంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఆటగాళ్లు విజృంభించారు. 25.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై భారీ విజయాన్ని అందుకున్నారు.
భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్‌కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్‌కుమార్‌రావును కమిషన్ జాతీయ ఐకాన్‌గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్‌లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు నియమితులయ్యారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.
శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్శిటీలో యునెస్కో 'వరల్డ్ హెరిటేజ్ సైట్' ఫలకాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును రాయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు.
తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పెట్రోల్ బాంబు విసిరిన ఘటన కలకలం రేపిన విషయం విదితమే. చెన్నైలోని రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ సీసాను విసిరేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.
రల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితం చేసింది.
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో జట్టు విఫలమైతే బాబర్ అజామ్ కెప్టెన్సీకి ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియ, అఫ్గానిస్తాన్‌లతో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.