పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం తన కిడ్నీని ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.
పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఓ యువకుడితో ప్రేమలో ఉన్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా సదర్ కొత్వాలి మంఝన్‌పూర్ ప్రాంతంలోని తేజ్వాపూర్ గ్రామంలో 5 రోజుల క్రితం బావిలో తలలేని ఓ టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత పెంచేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని షోయిగు చెప్పారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది.