నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గత తగాదాలను దురదృష్టకర పరిస్థితి అని అన్నారు.
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)ల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమాచార హక్కు చట్టం, 2005 ‘మృతపత్రం’గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణాలను మాఫీ చేయడం, కొత్త పథకం కింద సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స వంటి అనేక చర్యలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం హామీ ఇచ్చారు.
బాలీవుడ్ రాపర్ బాద్‌షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్‌ప్లే అనే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్‌వర్క్ రాపర్ బాద్‌షా, నటుడు సంజయ్ దత్‌తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూమి కింద నిధిని కనుగొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్‌లోని బస్ డిపోలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు పది బస్సులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్‌లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దుర్గ్ జిల్లాలోని తన సాంప్రదాయ స్థానమైన పటాన్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. కల్లబొల్లి మాటలతో , మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ అంటూ ఆయన చెప్పారు.