Great Father: ఓ గొప్ప తండ్రి కథ.. కూతురి కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని యోధుడి స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Great Father: పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం తన కిడ్నీని ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు. ఓ గొప్ప తండ్రి కథను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ముఖర్జీ మదివాడ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Also Read: Phone Hacking: యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్.. కేంద్రం హ్యాక్ చేస్తోందని ధ్వజం
Also Read
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
అసలు కథేంటంటే.. ప్రమోద్ (పేరు మార్చబడింది) ఓ రోగి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను గొప్పతండ్రి. చాలామంది పిల్లలు పుట్టగానే తండ్రులవుతారు. కానీ ఆయన ఉన్నతమైన పిలుపుతో ప్రమోద్ తండ్రి అయ్యాడు. అతని కుమార్తె కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఆమెకు కిడ్నీ మార్పిడి అవసరం. మరో ఆలోచన లేకుండా తన కిడ్నీని దానం చేసేందుకు సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు శస్త్రచికిత్సకు ముందు చేసిన టెస్టులలో అతనికి తీవ్రమైన గుండె జబ్బు ఉన్నట్లు కనుగొనబడింది. ప్రమోద్ గుండెలో రెండు బ్లాక్‌లు 90 శాతం మూసుకున్నాయి. స్టెంటింగ్ చాలా అవసరం. కిడ్నీ దానం చేయడానికి కనీసం మూడు నెలలు ఆగాలని వైద్యులు చెప్పారు. అయితే రెండు నెలలకే కుమార్తె పరిస్థితి విషమించింది. ఆమె ప్రాణం ప్రమాదంలో పడింది. ఆమె మూడు నెలలు వేచి ఉండలేకపోయింది. అతను మూడు నెలల ముందు తన కిడ్నీని ఇవ్వలేకపోయాడు. ప్రమోద్ తన నిర్ణయం తీసుకున్నాడు.
Also Read: Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. గ్రూప్ కాలింగ్ పై..
రెండు నెలల్లో డాక్టర్లు ఆపరేషన్ చేస్తే ఫలితాన్ని అంగీకరిస్తానని డిక్లరేషన్‌పై సంతకం చేశాడు. డాక్టర్లు తనకు ప్రమాదమని ఎంత హెచ్చరించినా వైద్యుల మాట వినలేదు. కూతురి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం అంటూ.. కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. శస్త్రచికిత్స సమయంలో అతని ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది. కానీ అతను దానిని ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. అది కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమ.అదృష్టవశాత్తూ, శస్త్రచికిత్స తర్వాత, ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత అతని సింగిల్ కిడ్నీ కొద్దిగా పనిచేయదని వైద్యులు చెప్పారు. కానీ తన కూతురిని రక్షించుకున్నాననే చిరునవ్వు దానిని అధిగమించేసింది. ఓ గొప్ప తండ్రి తన కూతురిని కాపాడడం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. తాను ఓ గొప్ప తండ్రిని కలిశానని చికిత్స చేసిన వైద్యుడు ముఖర్జీ మదివాడ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!