రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అంటే బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్‌లను కోర్టు కోరింది.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ పోలీసును ఉగ్రవాదులు అతని ఇంటిలోనే కాల్చిచంపారు. లోయలో గత మూడు రోజుల్లో ఇది మూడో లక్షిత దాడి కావడం గమనార్హం. బారాముల్లాలోని కరల్‌పోరా గ్రామంలోని కానిస్టేబుల్ గులాం మహ్మద్ దార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్‌లో కాంగ్రెస్ నాయకుడు "విడాకులు తీసుకున్నాను" అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది.
ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి నవంబర్ 2న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం (అక్టోబర్ 31) తెలిపారు. కాగా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను మహువా పూర్తిగా తోసిపుచ్చారు.
కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం అనేక ప్రతిపక్ష నాయకులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. యాపిల్ నుంచి తమకు హెచ్చరిక సందేశాలు వచ్చాయని, వారు తమ ఐఫోన్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న “స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్స్” లక్ష్యంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.