సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. యాత్రకు వెళ్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణలో గోల్ఫ్‌పై శ్రీనిధి యూనివర్సిటీ తమ నిబద్ధతను చాటుకుంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ సీజన్ 3లో K మోటార్స్ - ఆర్య వారియర్స్ విజయం సాధించింది.
జగనన్న ఆరోగ్య సురక్ష, 'వై ఏపీ నీడ్స్ జగన్' క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దాదాపు 98శాతం గ్రామ, 77 శాతం వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చిన అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించింది. 2007లో టీ-20 ఫార్మాట్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన మహి, 2011లో 28 ఏళ్ల కరువుకు స్వస్తి పలికి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావిని అన్నట్టు సజ్జల ఫీలవుతున్నారని ఆయన విమర్శించారు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ అంబట్‌పల్లికి చేరుకోనున్నారు. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు.