Thailand: భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా లేకుండానే థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
Also Read: Cash For Query: బీజేపీ వద్ద ఆధారాల్లేవ్.. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్న టీఎంసీ ఎంపీ
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
నవంబర్ 10, 2023 నుంచి మే 10, 2024 వరకు భారతీయులు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు. ఒక ప్రవేశంపై ఒక వ్యక్తి 30 రోజుల వరకు ఉండగలరు. థాయ్‌లాండ్ భారతదేశంతో సహా పర్యాటకాన్ని పెంచాలని చూస్తోంది. ఈ సెప్టెంబర్‌లో ఇలా వీసా రహిత కార్యక్రమాన్ని చైనీయుల కోసం అమలు చేసింది. ద్వీప దేశం శ్రీలంక కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏడు దేశాలను ఎంచుకుని పైలట్ ప్రాజెక్టుగా వీసా రహిత విధానాన్ని ప్రకటించింది. ఈ పైలట్ ప్రాజెక్టు మార్చి 31, 2024 వరకు అమలు చేసింది. ఏడు దేశాల ప్రజలు వీసా లేకుండా శ్రీలంకలో పర్యటించవచ్చు. ఆ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా కూడా ఉన్నాయి.
Also Read: Ashwini Vaishnaw: 150 దేశాల్లో యాపిల్ సలహా జారీ.. ప్రతిపక్షాల హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించిన కేంద్రం
ఇదిలా ఉండగా కొవిడ్ అనంతరం థాయ్‌లాండ్‌ను పర్యటించిన వారిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ ఉంది. భారత్ నుంచి 12 లక్షల మంది ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో పర్యటించారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. విదేశాల్లో పర్యటించే వారి సంఖ్య 2011లో 1.4 కోట్లు ఉండగా.. 2019 వరకు 2.7 కోట్లు అంటే క్రమంగా పెరుగుతూ వస్తోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!