TPGL 2023: తెలంగాణలో గోల్ఫ్‌పై శ్రీనిధి యూనివర్సిటీ తమ నిబద్ధతను చాటుకుంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ సీజన్ 3లో K మోటార్స్ – ఆర్య వారియర్స్ విజయం సాధించింది. TPGL 3వ ఎడిషన్‌లో 8 కొత్త జట్లు పాల్గొన్నాయి. వారు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడం కోసం అద్భుతాలు చేశారు. మరోవైపు 2024లో జరిగే 4వ TPGLలో ఇంకా అనేక జట్లు పాల్గొననున్నాయి.
జట్లకు స్పాన్సర్ చేసిన అనేక కార్పొరేట్ సంస్థలతో సహా విజేతలు, భాగస్వామ్యులను హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సత్కరించింది. ఈ సందర్భంగా శ్రీనిధి యూనివర్శిటీకి చెందిన మహోన్నత టీమ్ కె మోటార్స్ – ఆర్య వారియర్స్ జట్టును ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ కటికనేని తాహెర్ మహి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహి మాట్లాడుతూ.. గోల్ఫ్, మన నగరాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో అంకితభావంతో కూడిన పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు తమతో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. క్రీడను ప్రోత్సహించినందుకు గోల్ఫర్‌లు, స్పాన్సర్‌లు, హెచ్‌జిఎ అందరికీ తాము కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోసం తమ మద్దతును పునరుద్ఘాటించడానికి కృషి చేస్తామన్నారు.
ఫైనల్ లో విజేతలు, ఫైనలిస్ట్‌లను స్టార్ నటి మధుషాలిని సత్కరించారు. అంతేకాకుండా.. బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేను క్రీడను ప్రేమిస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో గోల్ఫ్ పట్ల ఉన్న ఉత్సాహాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.