తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది.
పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ 13వ వార్డు, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని ఈ సందర్భంగా వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ గడ్డ చైతన్య వంతమైనదని, ఓటు విచక్షణతో వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు.
ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఉదయం 12 గంటలకు సీఎం జగన్ రాయచోటి చేరుకోనున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుమారుడు వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు.