అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 11న రాష్ట్రానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
ప్రపంచకప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో వాటాను కోల్పోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు.
ఎక్కడ పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు డిసైడ్ అయ్యారని.. అందరూ డిసెంబర్ 3 కోసం వెయిటింగ్ అంటూ పేర్కొన్నారు.
జోగు రామన్న నీతిమంతుడైతే కేసీఆర్ ఎందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని ప్రజలకు ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.