అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లపర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు.. స్వతంత్ర అభ్యర్థులు మరోవైపు భారీ ఏర్పాట్లతో రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకుని నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నర్సాపూర్ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది.
2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. చండూర్‌లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగిత్యాలలో 82 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ దాఖలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు వచ్చి వెళ్లారని.. ఐఐఎం మెడికల్ కాలేజ్‌లు ఉన్నత విద్యా సంస్థలు విభజన హామీలు ఏవీ అమలు చేయని పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలక స్థానమైన గోషామహల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. నందకిషోర్ వ్యాస్ పేరును గులాబీ బాస్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు.
119లో కేసీఆర్ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా టికెట్ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చిందన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక కాంగ్రెస్‌లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్‌చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు.