వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మరో క్యాంపెయిన్ చేపట్టనుంది. నేటి(గురువారం) నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.
ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం ఇవాళ ఉదయం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.
గోదావరి డెల్టాకు రబీకింద సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు.
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలిచే తన పార్టీ అభ్యర్థులను జనసేన మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.