Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము.. డబుల్ బెడ్రూం ఇచ్చిన చోట మీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: జోగు రామన్న నీతిమంతుడైతే కేసీఆర్ ఎందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని.. తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదు.. నిధులు రాలేదు.. నియామకాలు జరగలేదన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయిందని, అన్నారం పగిలిపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అంటూ రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే.. పదేళ్లయినా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.
Also Read: PM Modi: “సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు”.. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ..
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
జోగు రామన్నకు.. జోకుడు రామన్నకు తేడా లేదన్నారు. రాష్ట్రంలో జోగు రామన్నలాంటి పిల్ల రాక్షసులకు గురువు బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఆ బ్రహ్మరాక్షసుడిని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలకు ఏమీ చేయని బీఆర్‌ఎస్‌కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు.బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని రేవంత్ చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోడీ… నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా…మోదీ తెలంగాణకు వచ్చి తొండను కూడా పట్టలేకపోయారన్నారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: నా లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దింపడమే.. అది బీజేపీతో సాధ్యం కాలేదు..
టికెట్ రానివారు వాడో వీడో చెబితే వినొద్దన్న రేవంత్.. టికెట్ రానివారికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షణికావేశానికి గురికావద్దన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ అంటూ రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఎవరు వస్తారో రండి.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం నామినేషన్లు వేయమని సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతామని… డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌కు బీఆర్‌ఎస్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తుంది… ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..