దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చాక నేను ఎక్కడైనా ఒక్క రూపాయి తిన్నానని రామ్మోహన్ నాయుడు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.
రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తుఫాన్ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఈ నెల 13, 14 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనుంది. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ పేర్కొన్నారు.