ఇవాళ సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్‌మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు.
కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ స్వామీజికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 60 కేజీల కారంతో అభిషేకం చేశారు. మీరు చదివింది నిజమే.. అచ్చమైన కారంతోనే అభిషేకం. పూలతోనో, పాలతోనో, పంచామృతాలతోనో అభిషేకం అన్ని చోట్లా జరిగేదే.. కానీ ఇక్కడ కారాభిషేకానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్.. మొదట స్వామిజీకి స్నానం చేయిస్తారు.
గుడి తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదని 17 కుటుంబాలను కుల బహిష్కరణతో పాటు గ్రామం నుంచి బహిష్కరించిన అమానుష ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలోని అరుంధతి నగర్‌లో చోటుచేసుకుంది.
పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు
నాసా హెచ్చరిక ప్రకారం, నవంబర్ 30న అంటే ఈ రాత్రి భూమిని సోలార్ తుఫాను తాకవచ్చు. అయితే, సౌర తుఫాను అంటే ఏమిటి?.. అది భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మానవ ఆరోగ్యానికి హానికరమా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటే, చింతించకండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. సౌర తుఫాను అంటే ఏమిటి.. అది ఎలాంటి ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.