టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది.
విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు తొలిదశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలోని కరువు స్థితి గతులను గవర్నర్‌కు విన్నవించడం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు.
కొల్లు రవీంద్రకు దేవుడు ఒక శాపం ఇచ్చాడని అది సిగ్గు లేకుండా మాట్లాడటమని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా అంటూ నాని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.
ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వంద కోట్ల బడ్జెట్ క్రీడలకు కేటాయించారన్నారు. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు.
గత ఎన్నికలలో గెలుస్తామో లేదో తెలియదు కానీ బరిలో నిలబడాలి అని నిర్ణయించి పోటీకి దిగానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సారి పరిస్థితి అలా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ మహాత్ముడు అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చని.. కానీ జగన్ ప్రజా కంటకుడు అని విమర్శలు గుప్పించారు.