తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు.
దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు మధ్యాహ్నం కంటే ముందు తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..