CM Jagan New Year Wishes: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Read Also: CM YS Jagan: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు.. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.