Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఏడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Read Also: Boat Racing Competition: సంక్రాంతి స్పెషల్.. సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ పడవ పోటీలు ప్రారంభం
అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియకపోవడంతో కార్మికుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.