ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది.
విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తన కెరియర్ కూడా గ్రేహౌండ్స్ నుండే ప్రారంభమైందని సీపీ రవిశంకర్ వెల్లడించారు.
నియోజకవర్గ మార్పుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కన్నీటిపర్యంతం అయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రిని గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు సీట్లు మనమే గెలవబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోనసీమ అందాలసీమ అని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.