CS Review on Elections: ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Review on Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు. బదిలీల అనంతరం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన సుమారు 2 వేల మందిని బదిలీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌తో సమీక్షకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు హాజరయ్యారు.
Read Also: Andhrapradesh: జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
Also Read
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాల్లో వచ్చే జూన్ నాటికి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులను ఈనెల 25లోగా తప్పని సరిగా బదిలీ చేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు వంటి సౌకర్యాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా, తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని సీఎస్ పోలీస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా.. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా.. మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈవో మీనా సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, శాంతి భద్రతల అదనపు డీజీపీ ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఇవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!