Vizag CP Ravishankar: విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తన కెరియర్ కూడా గ్రేహౌండ్స్ నుండే ప్రారంభమైందని సీపీ రవిశంకర్ వెల్లడించారు. ప్రతి రాష్ట్రం నుంచి ఉత్తమ ప్రతిభ కలిగిన కమాండోలు రావడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు ప్రపంచంలోనే ది బెస్ట్ కమాండో కాంపిటీషన్స్ గా నిలుస్తాయని ఆయన అన్నారు.
ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు నిర్వహించబడుతున్నాయని గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 23 బలగాలు, పది రాష్ట్రాలకు చెందిన 17, కేంద్ర పారామిలటరీకి చెందిన ఆరు బలగాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. ఈనెల 30వ తేదీన ముగింపు వేడుకలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. 5 విభాగాల్లో పోటీలు జరగనున్నాయన్నారు. మొత్తం 750 నుండి 800 వరకు వరకు కమాండోలు పాల్గొంటున్నారని అడిషనల్ డీజీపీ తెలిపారు.
Read Also: AP Government: అంగన్వాడీలకు సర్కార్ షాక్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..!
కాగా, 2008వ సంవత్సరం నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి.. పలు రాష్ట్రాల నుంచి కేంద్ర పోలీసు బలగాలు పాల్గొనున్నాయి.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ – 2024 కు ఆంధ్ర ప్రదేశ్ తరపునా గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తుంది. ఇక, 13వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ పోటీలు మనేసర్ లో జరిగింది.. 10వ ఏఐపీసీసీ-2018 పూణేలో నిర్వహించారు.. మరోవైపు.. కోవిడ్ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేశారు.. ఇటీవల జరిగిన 13వ ఏఐపీసీసీ పోటీల్లో విజేతగా ఐటీబీపీ (ITBP) నిలిచింది. ఏపీ గ్రేహౌండ్స్ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్స్ ట్రోఫిని.. 6వ ఏఐపీసీసీ పోటీలలో రన్నర్ ట్రోపీని గెలుచుకుంది. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 పోటీల్లో 23 జట్లు పాల్గొంటున్నాయి.. ఈ పోటీల్లో ఐదు దశలు ఉంటాయి తమ స్థాయిలో వారిని సామర్థ్యం నైపుణ్యము.. ఓర్పును ప్రదర్శించి అత్యున్నత స్థానం కోసం ప్రయత్నిస్తాయి.