టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది.
2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్ వారీగా ఎన్నికల కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నన్ను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్న ఎమ్మెల్యే ఆర్థర్.. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు.