Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. గతంలోనూ శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు, రుద్రపార్కు వద్ద చిరుతపులి సంచరించిన విషయం తెలిసిందే. రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని భక్తులకు, స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Ambati Rambabu: పదవిని పక్కనపెట్టి కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్..
చిరుతపులి సంచారంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయంలో మునిగిపోయారు. చాలా మంది శ్రీశైలం దేవస్థానానికి తరలివస్తున్నారు. దీంతో వారిలో మరో కొత్త భయం నెలకొంది. అయితే శ్రీశైలంలో రోజురోజుకూ చిరుత పులుల సంచారం పెరుగుతూనే ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానానికి వస్తున్న భక్తులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు.