వాలెంటైన్స్ డే, దానితో పాటు శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేసుకోవాలని, కాస్త మద్యం సేవించాలనే కోరిక కలగవచ్చు. మీ భాగస్వామితో సరదాగా గడపడానికి సన్నాహాలు చేయవచ్చు. అయితే ఆల్కహాల్‌తో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మనం చాలాసార్లు ఎంచుకుంటాము. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మనం ఏయే ఫుడ్స్‌ను తీసుకోకూడదో తెలుసుకుందాం..
జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
జనసేనలో టికెట్ రాని నేతలంతా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని కేఏ పాల్ అన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముందు షర్మిలా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని తానే చెప్పానన్నారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పేశారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మే 13 నుంచి 19 వరకు ఈఏపీసెట్, మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.
భారతీయ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడు ఇబ్బందులు పడతారో తెలియదు కాబట్టి... అందుకే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
బ్రెజిల్ చాలా అందమైన దేశం. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడ ఇలాంటివి చాలానే ఉన్నాయి. బ్రెజిల్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రియో కార్నివాల్ ప్రారంభమైంది.