అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావచ్చని.. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో అని ఎంపీ మిథున్ రెడ్డి తన మనస్సులోని మాటను తెలిపారు.
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
పవన్‌కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌లా పవన్.. జగన్ దగ్గర అవ్వన్నీ నడవవన్నారు. యుద్ధం అంటున్నావ్ పవన్ ...2014, 2019లో ఏమి చేసావు.. జగన్ నీకు పెద్ద సినిమా చూపించాడన్నారు.
తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్ ఎద్దేవా చేశారు.
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.
ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది.