ఏపీలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పారుపూడి కనక చింతయ్య సమేత శ్రీ వీరమ్మ తల్లి పేరంటాల మహోత్సవ వేడుకలు గత 11 రోజులుగా ఉయ్యూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ మాచాని సోమనాథ్ సైకిల్ యాత్రను చేపట్టారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో గోపురాలను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చె భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు.
జనసేన - టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
మన ఆహారం, జీవనశైలి మన ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, మన ఆహారం యొక్క ప్రభావం మన సంతానోత్పత్తిపై కూడా చూడవచ్చు. ముఖ్యంగా పురుషులు తరచుగా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించి తాజా అధ్యయనం కూడా బయటకు వచ్చింది.
ప్రతిరోజు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే మీరెప్పుడైనా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి విన్నారా? దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీని అల్పాహారానికి ఒక ప్రత్యామ్నాయంగా చెప్తారు. అంటే ఈ కాఫీ తీసుకుంటే అల్పాహారం చేసేసినట్లే.