ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైసీపీ 9వ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ జాబితాను రిలీజ్ చేసింది.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు కన్నెర్ర జేస్తే వైసీపీ గల్లంతవుతుందన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి. గన్నవరంలోని ఏబీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి తెలుగు మహిళా సమావేశంలో వెంకట్రావుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్‌ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
లివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు.
దయచేసి తన కూతురు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో నూతన సచివాలయం, పాలశీతలీకరణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపీ టీడీపీలో చిక్కుముడి ఇంకా వీడడం లేదు.