Home Minister Anitha: విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై స్పందించిన హోం మంత్రి
- విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత
- విశాఖ సీపీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
- నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
Read Also: Vizag Crime: విశాఖలో దారుణం.. లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి..!
Also Read
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
విశాఖపట్నంలో లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని ఎన్‌వీపీ లా కాలేజీలో లా థర్డ్ ఇయర్ చదువుతోంది.. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది.. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ.. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు.. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Read ALso: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు
ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి.. బెదిరిస్తూ.. మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి.. తమ పశువాంఛ తీర్చుకున్నారు.. అయితే, 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్, రాజేష్, జగదీష్.. బాధితురాలికి ఫోన్ చేసి.. తమ వద్దకు రావాలని, కోరిన కోరికను తీర్చాలని బెదిరించారు.. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీ దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు.. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు.. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని.. ఏం జరిగిందని నిలదీయడంతో.. అసలు విషయం బయటపెట్టింది.. దీంతో.. విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసుపై హోంమంత్రి స్పందించి యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..