జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
తెలంగాణలోనే అతిపెద్ద ప్రసిద్ద పుణ్యక్షేత్రం మైనా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ.2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి అల్వాల్‌లోని టిమ్స్ సమీపంలో నేడు భూమిపూజ చేయనున్నారు.
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు.
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని కొత్తగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది. 12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.