Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ రోజు దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించనున్నారు. రేపు ధనిష్ట నక్షత్రయుక్త కర్కాటకలగ్నమందు సాయంత్రం 4.35 గంటలకు శ్రీ ముక్తీశ్వర శుభానందల కళ్యాణ మహోత్సవం జరగనుంది.
Read Also: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం లింగోధ్బవ పూజ నిర్వహించనున్నారు. ఎల్లుండి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూర్ణాహుతి, విశేష పూజలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి కల్యాణం జరగనుంది. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 50 వేల లడ్డూలు, 20 వేల పులిహోర ప్యాకెట్లు తయారీ చేయించారు. 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.