Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్‌ను ముంచనీకి..
- కాంగ్రెస్‌పై మణిశంకర్ అయ్యర్ విమర్శలు..
- కేరళ ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ గెలుస్తుందన్న కాంగ్రెస్ నేత..
- కాంగ్రెస్ సీనియర్లపై విమర్శలు, సీఎం విజయన్‌పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Shankar Aiyar: కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘‘కీలు బొమ్మ’’గా, శశి థూరూర్‌ను ‘‘పాకిస్తాన్ వ్యతిరేకి’’, ‘‘తదుపరి విదేశాంగ మంత్రి’’ కావాలనే ఆశ ఉందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్‌ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి” అని అన్నారు. ఇదే కాకుండా కేరళలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న తరుణంలో.. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం పినరయి విజయన్ మంచి పనులు చేస్తున్నారు’’ అని కితాబు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన “విజన్ 2031: డెవలప్‌మెంట్ అండ్ డెమోక్రసీ” సెమినార్‌లో, అయ్యర్ కేరళ ముఖ్యమంత్రి మరియు సీపీఎం నాయకుడు పినరయి విజయన్‌ను ప్రశంసించారు.
దీని తర్వాత, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పవన్ ఖేరా X లో మాట్లాడుతూ, ‘‘మణి శంకర్ అయ్యర్‌కు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంతోనే మాట్లాడతారు’’ అని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని,ఎల్డీఎఫ్-బీజేపీలు రహస్య భాగస్వాములు అని జైరాం రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?