Hyderabad Metro: ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ జరగనుంది. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు కనెక్ట్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేశారు. గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్‌ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రూట్ మ్యాప్ తయారైంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేయటం విశేషం. హైదరాబాద్‌ని అన్ని రూట్లలో కనెక్టివిటీ పెంచటం ద్వారా సామాన్యుల నుంచి సామాన్యుల వరకు మెట్రో రైలు సేవలను అందరికీ అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్ బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగిస్తారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు రూట్ నిర్మాణం చేపడుతారు.
Also Read
Read Also: Edupayala Jatara: నేటి నుంచి ఏడు పాయల జాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు
కొత్త రూట్ మ్యాప్
కారిడార్ 2; ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు (5.5 కిలోమీటర్లు)
కారిడార్ 2; ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు)
కారిడార్ 4; నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు)
కారిడార్ 4; మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు)
కారిడార్ 5; రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కిలోమీటర్లు)
కారిడార్ 6; మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కిలోమీటర్లు)
కారిడార్ 7; ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కిలోమీటర్లు)
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!