Ponnam Prabhakar: గురువారం జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయ నాయకుడు అనుకున్నాను కానీ జ్యోతిష్యుడు అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఊదు కాలది పీరు లేవలే అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఏం చేస్తామో చేసి చూపిస్తామన్నారు.
Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ సీఎం కుమార్తె
గత ప్రభుత్వంలో 500 వంటగ్యాస్, 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవడం గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ లాగా మేం ఇంజనీర్లు కాదన్నారు. డ్యామ్ సేఫ్టీ బృందంతో నిపుణుల కమిటీతో విచారణ జరుగుతుందని.. దాని తదనంతరం చర్యలు చేపడతామన్నారు. నీటి సమస్య ఉందని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ పట్టణంలో తాగునీరు సమస్య వస్తే కరీంనగర్ ఎమ్మెల్యే, నగర మేయర్ బాధ్యత వహించాలని సూచించారు.