Mrunal Thakur : దాని కోసం దర్శకుల వెంటపడక తప్పడంలేదు: మృణాల్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అందులోను ముఖ్యంగా హీరోయిన్ లకు.. ఎంత అందంగా ఉన్నప్పటికి స్టార్ డమ్ సంపాదించుకోవాలి అంటే తిప్పలు పడాల్సిందే. కొంత మందికి అదృష్టం బాగుండి అవకాశాలు వస్తాయి అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. తన అందం, అభినయంతో సౌత్ నార్త్ ప్రేక్షకులను మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘దో దీవానే షెహర్ మే’ విడుదల సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మృణాల్ తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్‌తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్
Also Read
మంచి పాత్రల కోసం దర్శకుల వెంట పడటంలో ఏమాత్రం తప్పు లేదని మృణాల్ స్పష్టం చేశారు.. ‘మనం ఒక పాత్ర కోసం ఎంత ఆకలితో (Hungry for work) ఉన్నామో తెలిస్తేనే దర్శకుల ఆలోచనా విధానం మారుతుంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. తన తాజా చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ అవకాశం కూడా అలానే వచ్చిందని ఆమె వెల్లడించారు. దర్శకుడు రవి ఉద్యావర్ తెరకెక్కించిన ‘మామ్’ సినిమా చూసి ఫిదా అయిపోయిన మృణాల్, నేరుగా ఆయన్ని కలిసి.. “సర్, మనం సినిమా ఎప్పుడు చేస్తున్నాం?” అని అడిగేశారట. ఆమెలోని ఆ ధైర్యమే నేడు ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం తెచ్చిపెట్టింది.
గతాన్ని గుర్తుచేసుకుంటూ.. “మొదట్లో నాకు పని ఎలా అడగాలో కూడా తెలియదు. ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ గారినే నేను మొదటిసారి అవకాశం అడిగాను. ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం వాళ్లకు కనిపించేలా చేసుకోవడానికి ‘సర్, నేను ఇక్కడే ఉన్నాను.. నన్ను ఒకసారి కాస్ట్ చేయండి’ అని బతిమిలాడేదాన్ని’ అంటూ మృణాల్ ఎమోషనల్ అయ్యారు. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఆమె నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. అరేంజ్డ్ మ్యారేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మృణాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!