సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వట్టిమాటలు చెబుతున్నదన్న నేతలకు మా పథకాలే సమాధానమని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్‌లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.