Rekha Vedavyas: హీరోయిన్ ఆవేదన.. పెళ్లి చేసుకుందామంటే ఎవరూ రావట్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Vedavyas: సినిమా సెలబ్రిటీల జీవితం బయటకు కనిపించే అంత రంగులు వారి వ్యక్తిగత జీవితాల్లో ఉండవు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు దాగి ఉంటాయి. కొందరు వాటిని బయటపెట్టకపోయినా.. మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ ‘రేఖ వేదవ్యాస్’ ఒకరు. 2001లో విడుదలైన ‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేఖ.. తన క్యూట్ నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించారు.
Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
అయితే వరుస పరాజయాలు పలకరించడంతో ఆమె సినీ ఇండస్ట్రీకి క్రమంగా దూరమయ్యారు. 2012 తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని రేఖ.. అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గత కొన్నేళ్లుగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా చాలా కుంగిపోయానని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతోనే సినిమాలకు దూరమయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?
పెళ్లి విషయానికొస్తే.. గతంలో తనకు వివాహంపై పెద్దగా ఆసక్తి లేకపోయిందని, కానీ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్లే బంధాల కంటే, ఆలస్యమైనా మంచి సంబంధం రావాలని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న సినిమా పరిశ్రమ పూర్తిగా మారిపోయిందని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానంటే అది దేవుడి దయేనని రేఖ అన్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!