ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) సంబంధించి దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఏఏపై చర్చ మరోసారి తీవ్రమైంది. ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలాసార్లు వివాదాలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది.
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన 'పౌరసత్వ సవరణ చట్టం-2019'పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం.
ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. దీంతో 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 19 మంది పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి సిఫార్సు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లయితే, వారు త్వరలో మంత్రిగా ప్రమాణం చేయవచ్చు.
పోర్న్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.అడల్ట్ ఫిల్మ్‌స్టార్స్ వరసగా మరణిస్తున్నారు. గత నెల ఓ నటి ఆత్మహత్య చేసుకోగా.. ఆదివారం మరో అడల్ట్ స్టార్ 26 ఏళ్ల సోఫియా లియోన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. తాజా పోర్న్ స్టార్ ఎమిలీ విల్లిస్(26) గుండెపోటుకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఎమిలీ విల్లిస్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.