Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre likely to notify CAA rules today: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం. ఈ రాత్రిలోగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూల్స్‌ను నోటిఫై చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం
Also Read
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2019లో అమలులోకి వచ్చిన సీఏఏ, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 11, 2019న పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) భారతదేశం అంతటా తీవ్ర చర్చ, విస్తృత నిరసనలకు సంబంధించిన అంశం. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడం గమనార్హం. కానీ ఇంతవరకూ దీనిపై నిబంధనలు రూపొందించక పోవడంతో ఈ చట్టం అమలులోకి రాలేదు. ఈ క్రమంలోనే చట్టం నిబంధనపై కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
Read Also: Pakistan: షెహబాజ్ షరీఫ్ కేబినెట్‌లో 19 మందికి చోటు!
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన, అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికి భారత పౌరసత్వానికి వేగవంతమైన మార్గాన్ని అందించడానికి 1955 పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సవరించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వర పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం నెలకొంది.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా? నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!