పిల్లి కారణంగా జపాన్‌లోని ఓ నగరం అప్రమత్తమైంది. జపాన్‌లోని ఒక మహానగరమైన పుకుయామా వణికిపోతోంది. ఏం వార్త వినాల్సి వస్తోందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణమేమిటంటే.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి కనిపించకుండాపోవడమే.
డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ ఇటీవల అరెస్టయిన అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌తో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై అన్నాడీఎంకేకు చెందిన ఎడప్పాడి కరుప్ప పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలైపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం పరువు నష్టం దావా వేశారు.
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు.
అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా.. మార్చి 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు.
వరల్డ్ కిడ్ని డేను పురస్కరించుకుని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అందించే స్టార్ సెలబ్రిటీ అవార్డులను కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికి ప్రదానం చేశారు.