MLC Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 9న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆరు జిల్లాల పరిధిలో 16036 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా ఈ సారే అతి తక్కువ నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరగగా.. పీడీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఎన్నికయ్యారు రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.
Read Also: AP High Court: తక్షణమే ఆ కట్టడాలను కూల్చేయాలి.. కల్వరి టెంపుల్‌పై హైకోర్టులో పిటిషన్
నామినేషన్లు దాఖలు చేసింది వీరే..
*బొర్రా గోపీ మూర్తి, రిటైర్డ్ టీచర్
*గంధం నారాయణరావు, రిటైర్డ్ టీచర్
*నామన వెంకటలక్ష్మి, ప్రైవేటు కళాశాల లెక్చరర్
*కవల నాగేశ్వరరావు, ప్రైవేటు ఫార్మజీ కాలేజ్ లెక్చరర్
*పులుగు దీపక్, కళాశాల లెక్చరర్
*షేక్ అహ్మద్, కాలేజ్ లెక్చరర్