ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు.
Praja Galam Public Meeting, PM Modi, Chandrababu, Pawan Kalyan, Chilakaluripeta, Andhrapradesh, AP Elections 2024, Lok Saha Elections 2024, Praja Galam Public Meeting LIVE Updates
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరగనుంది. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి సభలో ప్రసంగిస్తానంటూ.. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభం కాగా.. ఓ వ్యక్తి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అభ్యర్థిని కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు.
తాను హెడ్‌లైన్ల కోసం పని చేయనని, డెడ్‌లైన్‌ల కోసం పని చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ కాంక్లేవ్‌లో మోడీ వ్యాఖ్యలు.. సుదీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాలనే తన ఉత్సాహాన్ని చాటాయి.