Elvish Yadav: మనలో చాలా మంది పాములను చూస్తేనే భయంతో వణికిపోతారు. అక్కడ పాముందంటే, ఇక్కడి నుంచి ఇటే పారిపోతుంటారు. కనీసం పాముల పేర్లుఎత్తడానికి కూడా చాలా మంది అస్సలు ఇష్టపడరు. ఇంతటి భయంకరమైన పాముల విషాన్ని రేవ్ పార్టీలో ఉపయోగించారు. మనం సాధారణంగా రేవ్ పార్టీలలో అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు వేయడం మాత్రమే చూస్తుంటాం. కొందరు మత్తు పదార్థాలు కూడా తీసుకుంటారు. ఇదంతా సీక్రెట్‌గా పోలీసుల కంట పడకుండా జరుగుతుంటాయి.
Read Also: Israel: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు రేవ్ పార్టీలో పాములను ఉపయోగించాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఇతగాడిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గత ఏడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడేందుకు ఏర్పాటు చేసినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది. నోయిడాలోని సెక్టార్ 51లో గత ఏడాది నవంబర్ 3న బాంక్వెట్ హాల్‌పై పోలీసులు దాడి చేసి నలుగురు పాములను పట్టే వారితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అదే విధంగా.. తొమ్మిది పాములు, వీటి విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రేవ్ పార్టీలు, వీడియో షూట్‌ల కోసం ఎల్విష్ యాదవ్ పాములను కూడా ఉపయోగించారని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండించాడు ఎల్విష్ యాదవ్. అంతేకాదు.. ఈ కేసులో గనక తాను దోషిగా రుజువైతే కెమెరాల ముందు బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తనను కావాలని ఈ కేసులో ఇరికించారంటూ వ్యాఖ్యలు చేశాడు.
Read Also: DK Shivakumar: ఖర్గేకు ప్రధాని మోడీ భయపడుతున్నారు.. డీకే కీలక వ్యాఖ్యలు
మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ తాను నిర్వహించిన రేవ్ పార్టీలలో పాములు, పాము విషాన్ని ఏర్పాటు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గత ఏడాది పాము విషాన్ని సరఫరా చేసినందుకు అరెస్టయిన ఇతర నిందితులు తనకు తెలుసునని కూడా అంగీకరించినట్లు వారు తెలిపారు. 26 ఏళ్ల యూట్యూబర్, గతంలో పాము విషం కేసులో ప్రమేయం లేదని ఖండించారు. అయితే ఇప్పుడు తాను నిందితులను వేర్వేరు రేవ్ పార్టీలలో కలుసుకున్నానని, వారితో సంప్రదింపులు జరుపుతున్నానని అంగీకరించినట్లు సమాచారం.