Bus Accident in China: చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చైనా ప్రభుత్వ మీడియా బుధవారం సమాచారం ఇచ్చింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మధ్యాహ్నం 2:37 గంటలకు (0637 GMT) ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Read Also: Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?
మరో ఘటనలో.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైజౌలోని ఒక వృత్తి విద్యా పాఠశాల వద్ద ఒక కారు మంగళవారం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. తైజౌ ఒకేషనల్ అండ్ టెక్నికల్ కాలేజీలో ఉదయం 11:20 గంటలకు ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. మార్చి 1న, తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డెజావో నివాస ప్రాంతంలో ఒక కారు వ్యక్తుల సమూహంపైకి దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు మరణించగా.. అనేక మంది పిల్లలు గాయపడ్డారు.