తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టుమల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. నిన్న బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజు పేరును ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికిహైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిపై ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు.... ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.