Mahabubnagar: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఓటు వేశారు.
Read Also: Voting Rule: బూత్‌లో ఓటేయడానికి తిరస్కరిస్తున్న ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరు..
నాగర్ కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్‌రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు వేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి , స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు.