R Krishnaiah: ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయపార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారన్నారు. చాలా ముందు చూపుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, ప్రజల బంగారు భవిష్యత్‌కు బాట వేస్తున్నారని ఆయన తెలిపారు. పేద ప్రజల పిల్లల కోసం సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకువచ్చారని కొనియాడారు.
Read Also: Bandi Sanjay: సిరిసిల్ల వస్త్ర సంక్షోభంపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
దేశంలో 45 శాతం పేద ప్రజలు పేదరికంలో ఉన్నారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నారన్నారు. విద్య ద్వారా పేదరికం పోతుంది, ఉన్నత స్థాయికి వస్తారనే గొప్ప ఆలోచనతో సీఎం విద్యా విధానాన్ని ప్రోత్సహించారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో సీఎం చేసిన అభివృద్ధి పథకాలను ప్రోత్సహించాలని సూచించారు.