గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది..
ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం గుండుపల్లి పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 'పల్లె పల్లెకు కాకర్ల' కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.
మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో పుష్ప సినిమా సీన్ తరహాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజికి క్యారియర్ వాహనాన్ని నిందితుడు మాడిఫికేషన్ చేసి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు.
కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు.